* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
1. (ఓ యువ నట వారసుడు నటించిన సినిమా ఆడుతున్న థియేటర్ బయట జనాల గుంపులను చూస్తూ)
దానయ్య 1: అబ్బో ఏంటండీ ఇంత జనం. సినిమా అంత బావుందా?
దానయ్య 2: అంత లేదు. ఎవడో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకై వచ్చాడట. వాణ్ణి చూడటానికి జనం విరగబడుతున్నారంతే.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
2. యువహీరోగారి సినిమా విడుదలైన రెండ్రోజులకే డబ్బా తిరిగొచ్చేసే చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆశ్చర్యకరంగా నిర్మాత "మా సినిమాకు ఆంధ్రప్రదేశ్ అంతటా అన్ని థియేటర్లలోనూ ప్రవేశం ఉచితం" అని ప్రకటించాడు. ఊహించినట్టే మర్నాడు మార్నింగ్‌షోకి జనాలు ఎగబడ్డారు. అందర్నీ లోపలికి రానిచ్చిన తరువాత చల్లగా ప్రకటించాయి థియేటర్ వర్గాలు, "ప్రవేశం ఉచితమే, కానీ బయటకు వెళ్ళాలంటేనే వెయ్యి రూపాయలు పెట్టి టిక్కెట్ కొనాలి" అని. జనాలు ఎగబడి టిక్కెట్లు బ్లాకులో కొనుక్కుని మరీ పారిపోయారు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని. నిర్మాతకు మరో రెండు యువహీరో సినిమాలు తియ్యటానికి సరిపడా డబ్బొచ్చింది.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
3. బస్సులో ముఫ్ఫైమంది, వానులో పదిహేనుమంది, సుమోలో ఎనిమిదిమంది, కారులో ఆరుగురు కూర్చోగలరు.
కానీ ఒక్కడు కూడా కూర్చుని మన యు.న.వా. సినిమా చూడలేడు.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
4. యు.న.వా.:(వాచి షాపులో) ఒక మంచి వాచి చూపించండి.
దుకాణాదారు: ఇదుగోండి. ఇది చాలా మంచి కంపెనీ.
యు.న.వా.: బాగా ఆడుతుందా?
దుకాణాదారు: ఓ, మీరు నటించిన సినిమాలకన్నా బానే ఆడుతుంది
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
5.చంద్రముఖి - స్ప్లిట్ పర్సనాలిటీ
అపరిచితుడు - మల్టిపుల్ పర్సనాలిటీ
యువ నట వారసుడు - నో పర్సనాలిటీ.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
వాగ్దానం
"ఏమండీ... మొన్న ఎన్నికల్లో గెలిస్తే నాకు పదివేల రూపాయల పట్టుచీర కొనిపెడతామన్నారు. గెలిచి ఆర్నెల్లు అయినా మళ్లీ ఆ ఊసు ఎత్త లేదు" గోముగా అన్నది విశాలాక్షి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
"ఓట్లకోసం ఎన్నో వాగ్దానాలు చేస్తాం. అవన్నీ తీరుస్తురా ఎవరైనా విశాలా?" అన్నాడా రాజకీయ నాయకుడు.
తొందర
"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు రామబ్రహ్మం.
"నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు" చెప్పింది భార్య.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
అరుపు
"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు
"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.
మగాడు
"నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.
"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.
"నాకేం? నేను మగాణ్ణి"
"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.
Dissturbance
ఆసుపత్రిలో...
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
"ఏదీ మీ నోరు తెరిచి నాలుక బాగా జాపండి" అన్నాడు Doctor. Patient అలానే చేశాడు.
Doctor చక చక మందులు రాసిచ్చాడు.Patient వెళ్ళిపోగానే-
"అదేంటి Doctor, Patientని నోరు తెరవమని, నాలుకజాపమని అసలు అటుకేసి చూడకుండానే prescription రాశారు?" అడిగాడు junior doctor.
"అలా చెయ్యకపోతే patientలు ఆ మందు పేరేమిటి? ఈ టానిక్కు దేనికి? బాగా పని చేస్తుందా? లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అది నాకు నచ్చదు" నవ్వుతూ చెప్పడు senior doctor తన అనుభవమంతా రంగరించి
నెక్లెస్
"మన పక్కింటాయనను చూడండి, పెళ్లానికి రవ్వల నెక్లెస్ కొనిపెట్టాడు" సాధింపుగా అన్నది రాణి.
"అదేం పెద్ద గొప్ప? ఆవిడ ఒప్పుకుంటే నేనూ కొని పెడతా" పెదవులు చప్పరిస్తూ అన్నడు భర్త.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
కరువు
"ఎక్కడ? ఎక్కడ? అగ్ని ప్రమాదం జరిగిందెక్కడ?" ఫైరింజెన్ మీద నుంచి అరిచాడు ఆఫీసర్.
"అగ్ని ప్రమాదం ఏమీ లేదండయ్యా. పొద్దుట్నించీ పంపుల్లో నీళ్ళు రావడం లేదు. నీళ్ళ కోసం అలా పిలిచాం. తలా ఒక బిందెడు నీళ్ళుపోసి పుణ్యం కట్టుకోండి బాబయ్య" బిందెలు చూపుతూ అన్నారు అక్కడున్న వందమంది మహిళలు
సీరియల్
"ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్సేమైనా చూస్తున్నావా వదినా?"
"అబ్బే... ఈ సీరియల్స్‌తో విసుగెత్తిపోయింది. వాస్తవ జీవితమే ఎంతో హాయిగా ఉంది"
"వాస్తవ జీవితమా? ఎప్పుడు మొదలైంది? ఏ ఛానల్లో వస్తున్నది? ఎన్ని గంటలకొస్తున్నది?"
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
ఉచితం
"డాక్టర్ గారూ... నెను చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను" వినయంగా అన్నాడా వ్యక్తి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
ఉచితం
"డాక్టర్ గారూ... నెను చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను" వినయంగా అన్నాడా వ్యక్తి.
"సరే... ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?" అడిగాడు డాక్టర్.
"కాటికాపరినండీ... శవాలు తగలబెడుతుంటాను" అన్నాడతను.
"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది మాఆయనకు నా మీద ప్రేమ అనేది బొత్తిగా లేదని" అంది కమల
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
"ఇంకా నయం ప్రేమ ఉంటే ఇంకా ఎంత సంతానభాగ్యం కలిగేదో" అంది రాగిణి
చండశాసనుడు
"నేను చండశాసనుణ్ణి, ఏ చిన్న పొరబాటునూ సహించలేను. నిన్న నా భార్య కాఫీలో పంచదార తక్కువేసింది. వెంటనే దవడలు వాయించాను" అన్నాడు చిదంబరం.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
"నువ్వు చాలా అదృష్టవంతుడివి గురూ. నీకు చాలా మంచి కలలు వస్తుంటాయి" తలమీద బొప్పిని తడుముకుంటూ అన్నాడు సారధి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
గుడిలో
"నువ్వు ప్రతి అమ్మాయినీ ఏ పార్కుకో, బీచికో తీసుకెళ్ళకుండా గుడిలోకి తీసుకెళ్ళి 'I Love You' అని చెబుతావెందుకు?" సందేహంగా అడిగాడు శేఖర్.
"గుడిలో అయితే చెప్పులేసుకోవడానికి వీలుకాదు కదా" చెప్పాడు రాజు
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
సెలవు
"ఈరోజు స్కూలుకు సైకిల్ మీద వస్తుంటే లారీ గుద్దిందిరా. చచ్చేవాడిని. క్షణంలో ప్రాణగండం తప్పింది" పిల్లలతో చెప్పాడు టీచర్.
"అయ్యయ్యో... ఎంత పని జరిగింది సార్.... మాకు సెలవు యోగం క్షణంలో తప్పింది" విచారంగా అన్నారు పిల్లలు
నిద్ర
"ఏమిటయ్యా సాయీ, ఆఫీసుకు ఇంత లేటుగా వచ్చావు?" కోపంగా అడిగాడు ఆఫీసర్.
"నిద్ర లేవటం ఆలస్యమైంది సార్" చేతులు నలుపుకుంటూ అన్నాడు సాయి.
"వాట్! ఇంటి దగ్గర కూడా నిద్రపోతున్నావా?" ఆశ్చర్యంగా అన్నాడు ఆఫీసర్.
వేలం
బస్సు వెళ్తోంది. హఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు.
"బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను" ఏడుస్తూ అన్నాడు.
"నాకిస్తే ఐదొందలిస్తాను" మరో వ్యక్తి అరిచాడు.
"నాకిస్తే వెయ్యి"
"నాకిస్తే రెండు వేలు..."
"నాకిస్తే నాలుగు వేలు..."
"అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా" అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.
"ఏంటీ వెధవ పని, అడుక్కునే వాడికెవరైనా రూపాయో, రెండో వేస్తారు. నువ్వు పది రూపాయలు వేశావేంటి?" కోపంగా అన్నడు భర్త.
"నువ్వు అచ్చం రంభలా ఉన్నావు అన్నాడు వాడు. పాతికేళ్ళనుంచి కాపురం చేస్తున్నా ఎనాడైనా ఈ విషయం కనిపెట్టారా మీరు? ఒక్కసారి చూడగానే గ్రహించాడువాడు" అన్నిది కామేశ్వరి.
పోయినోళ్ళు
"మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ... ఒక్కో నెహ్రూ... ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి" ఆవేశంగా పాఠం చెబుతున్నాడు మాస్టారు.
"అంటే మేమందరం చావాలనా మీ ఉద్దేశ్యం?" లేచి కోపంగా అడిగాడో విద్యార్ధి.
మానసిక వేదన
"మానసిక వేదన తగ్గడానికేమైనా tablets ఉన్నాయా uncle" shop అతడిని అడిగాడో కుర్రాడు.
"ఇవిగో బాబూ.. ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికలో మయమౌతుంది" బిళ్ళలిస్తూ అన్నాడు షాపతను.
"Thanks uncle" వెళ్తూ అన్నాడు కుర్రాడు.
"ఇంతకూ ఎవరికో చెప్పలేదు?" అన్నాడు షాపతను.
"మా నాన్నకే. ఇవాళ నా progress report చూపించాలి, వస్తా" వెళ్ళాడు కుర్రాడు.
1.బాస్: మీరెక్కడ పుట్టారు?
సర్దార్జీ: ఓయ్. కలకత్తాలో
బాస్: ఏ భాగం
సర్దార్జీ: ఓయ్. ఏ భాగం అంటావేమిటి? బాడీ మొత్తం కలకత్తాలోనే పుట్టింది.
2.ఇంటర్‌వ్యూయర్ : మీ జన్మదినం
అభ్యర్థి: ఆగస్టు 15
ఇంటర్‌వ్యూయర్: ఏ సంవత్సరం
అభ్యర్థి: ప్రతి సంవత్సరమూ... చిరాగ్గా చెప్పాడు
3.జడ్జి: ఆర్డర్! ఆర్డర్! ఎవరయినా అరిచారంటే వాళ్లను బయటకు పంపించేస్తా.
ముద్దాయి: హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హ
4.న్యాయమూర్తి: 10రోజుల జైలు లేదా 5,000 రూపాయలు
నిందితుడు: (తనలో) ఆహా.. గొప్ప ఛాయిస్ డబ్బే పుచ్చుకుంటాను.
5."వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య
6."పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం
"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.
7.రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు.
"నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అన్నడు రమణ.
"నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" చెప్పాడు గోవింద్
"నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి పౌరులుగ రూపొంది దేశం బాగుపడుతుందన్నారు నెహ్రూ గారు "అంది దీప.
"మరి నువ్వో?" మౌనంగా ఉన్న హరిని అడిగారు రాష్ట్రపతి
"నెహ్రూగారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా" దీపకేసి ఓరగా చూస్తూ చెప్పాడు హరి.
8."పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి.
"ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు.
"ఓహో అలాగా... రెండా?" అన్నాడు మురళి.
9.ఓక వేళ Windows 2000, తెలంగాణా భాషలో ఉంటే ఎట్లా ఉంటుంది??
Microsoft Windows 2000 = గింత అంత మెత్త కిటికీల్ రెండువేల్
Search = దెవులాడు
Save = బచాయించు
Save as = గిట్లా బచాయించు
Save All = గన్ని బచాయించు
Help = నన్ను బచాయించు
Find = ఎతుకు
Find Again = మళ్ళా ఎతుకు
Move = సర్కాయించు
Zoom = పెద్దగ చేయ్
Open = తెరువు
Close = ముయ్
New = కొత్తది
Old = పాతది
Replace = మార్చెయ్
Insert = నడిమిట్ల ఎట్టు
Space = జాగ
Backspace = ఎనక జాగ
Run = వురుకు
Print = అచ్చు
Copy = గట్లనే దించు
Cut = కోయ్
Paste = అతికియ్
Paste Special = పెషల్ అతికియ్
Delete = బొందలొ కొట్టు
View = సూడు
Tools = ముట్లు
Toolbar = ముట్ల గొట్టం
Exit = ఇగ వోరి
Mouse = ఎల్క
Click = ఒత్తు
Double Click = మల్ల మల్ల ఒత్తు
Scrollbar = తిప్పుడు గొట్టం
Errors = నీ నోట్ల మన్ను వడా!!
Home = ఇంటికి వో
End = కొనాక్కి వో
10.శంకర్ దాదా MBBS - సామెతలు
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది
Enki’s marraige , Subbi death anniversary
వంద గొడ్లని తిన్న రాబందు ఒక్క తుఫానుకి చస్తుంది.
One vulture eat 100 buffaloes…. One cyclone dead.
ముందుంది ముసళ్ళ పండగ
In front, crocodiles festival
ఇల్లు అలకగానే, పండగ కాదు
House pasting...No festival
మొగుడూ పెళ్ళాళయిన సీతా, రామారావు ఒకరోజు తీవ్రం గా గొడవ పడ్దారు. ఎప్పటికీ మొగుడు కాళ్ళు పట్టుకోకపోవడం వలన గబ గబ కొన్ని బట్టలను సర్దేసి బయటకు నడవబోతోంది సీత.
” ఎక్కడికి పోతున్నావు ? ” అడిగాడు రామారావు.
” నరకానికి” విసురుగా సమాధానమిచ్చింది సీత.
అయితే నిన్ను నాకు తగిలించి అక్కడకు పోయిన నా అత్తమామలకు నా నమస్కారాలు చెప్పు” వ్యంగ్యం గా అన్నాడు రామారావు.
2. డాక్టర్ గారూ. తీవ్రమైన అలసటగా వుంటోంది. దయచేసి టేస్టు చెయ్యండి” అడిగాడు సుబ్బారావు.
డాక్టర్ అన్ని పరీక్షలు చేసి “మీరు చాలా వీక్ గా వున్నారండి. ఈ మందులను వాడండి క్రమం తప్పకుండా వాడండి, దానితీ పాటు బాగా రెస్టు తీసుకొండి” అని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు.
” ఓ కె డాక్టర్ అయితే రేపట్నుంచి ఆఫీసుకు వెళ్ళడం ప్రారంభిస్తాను.అక్కడయితే పగలు కూడా బాగా నిద్రపోవచ్చు” అని భారం గా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు సుబ్బారావు.
“ఆ అంటూ నోరు తెరుచుకొని వుండిపోయాడు డాక్టర్.
మంచి ప్లానింగ్
అప్పారావు: (ఆఫీసర్ తో) ఈమె నా భార్య సార్…..మంచి ప్లానింగ్ వుంది. ఇవాల్టి పనిని నిన్ననే చేసేస్తుంది.
సుబ్బారావు:(ఆఫీసర్) వెరీగుడ్…………భోజనం చాలా బాగుందమ్మా.
అప్పారావు: వంట కూడా అంతే సార్. ఇవాళ మిమ్మల్ని పిలిచానని చెప్పగానే నిన్నే చేసేసింది.!
అరటిపండు
టీచర్: సోము! అరటిపండు గురించి చెప్పు?
సోము: తింటే బలపడతాం. తొక్కితే జారిపడతాం టీచర్.
ఏదైతేనేం!
అప్పారావు: ఇప్పుడు నాకు రోజూ కవిత్వం రాసే పనే!
సుబ్బారావు: వైద్యం చేయడం లేదా?
అప్పారావు: ఇప్పుడు అది మానేశా!
సుబ్బారావు: సరేలే ………………..జనాన్ని చంపడానికి ఏదైతేనేం!
నాకు తెలియదు!
టీచర్: సోము! విద్యార్ధులు ఎక్కువగా ఉపయోగించే పదం ఏమిటి?
సోము: నాకు తెలియదు టీచర్!
టీచర్: వెరీగుడ్!
అదీ సంగతి!
అప్పారావు: ఈ పుస్తకంలో పాత్రల్ని పరిచయం చేసేసరికే సరిపోయింది . అసలు కథే లేదు! మరో పుస్తకమేదైనా ఇవ్వండి.
లైబ్రేరియన్: అదా సంగతి! టెలిఫోన్ డైరెక్టరీ ఎక్కడ పోయిందా అని తెగ వెతుకుతున్నా!
బైక్ నడపడం వచ్చాక
పోలీస్: ఏరా……..ఈ సైకిల్ దొంగతనాలు ఎప్పుడు మానేస్తావ్?
దొంగ: బైక్ నడపడం వచ్చాక సార్!
కోపం
అప్పారావు :డాక్టర్! ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ కోపం వచ్చేస్తోందండీ……….
డాక్టర్: ఏంటీ………మళ్లీ చెప్పు?
అప్పారావు: ఎన్ని సార్లు చెప్పాలి ……..ఓ సారి చెబితే అర్థంకాదా? !
ఏకతాటి పై
టీచర్: సోము! స్కూలుకి తాడు తెచ్చావేంటి?
సోము: మీరే కదా సర్…………..అందరం ఏకతాటిఫై నిలబడాలన్నారు? !
బ్యాంకనుకున్నా!
పోలీస్: ఎందుకురా………….జైలు గోడ తవ్వుతున్నావు?
దొంగ: సారీ సార్! నాకు చదువు రాదు. ఇది బ్యాంకనుకున్నా!
పళ్ళు తోమానంతే!
నాన్నా: బబ్లూ! నా బ్రష్ ఇలాగైపోయిందేం? ఏమన్నా చేశావా?
బబ్లూ: ఏం చేయలేదు నాన్నా! టామీకి (కుక్క) పళ్ళు తోమానంతే!
చూపించు?
డాక్టర్: కుక్క కరిచిందా? ఎక్కడో చూపించు?
రోగి: పొరుగూరి తీర్థంలోనండి. వస్తారా?
నవ్వుకోరూ!
స్వీటీ: నాన్నా! నా జోక్స్ పేపర్లో అచ్చయ్యాయి చూడు .
అప్పారావు: ఎంత పని చేశావే ఎవరైనా చూస్తే నవ్వుకోరూ!
కరిచిందా?
అమ్మ: తమ్ముడిని కుక్క కరిచిందా? వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు.
స్వీటీ:ఆ కుక్క ఎప్పుడో పారిపోయిందమ్మా!
శుభ్రత
టీచర్: ఏంటి? పరీక్షలో ఖాళీ పేపరిచ్చిందిచాలక, 5 మార్కులు వస్తాయంటున్నావేంటి?
సోము: శుభ్రతకు 5 మార్కులన్నారుగా!
డబ్బే డబ్బు
చంటి పుట్టినరోజుకు వాళ్ల నాన్న స్నేహితుడు రవి డ్రమ్స్ బహుమతిగా ఇచ్చాడు.
నెలరోజుల తరవాత చంటి వాళ్ళింటికి వచ్చాడు రవి.
‘ఏరా చంటి…..డ్రమ్స్ నచ్చాయా? నేర్చుకుంటున్నావా?’ అడిగాడు రవి.
‘ఆరోజు నాకు వచ్చిన బహుమతులన్నింటిలోకీ నాకు బాగా నచ్చింది అదే అంకుల్’ హుషారుగా చెప్పాడు చంటి.
‘ఎందుకని?’
‘పొద్దున్నే దాన్ని వాయించకుండా ఉండటానికి నాకు అయిదు రూపాయలిస్తున్నారు నాన్న. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక కూడా దాన్ని వాయించకుండా ఉండటానికి అమ్మ మరో రెండు రూపాయలిస్తోంది’ చెప్పాడు చంటి.
రీచార్జ్ బెదిరింపు
అప్పారావు: సార్, ఫోన్ లో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
పోలీస్: ఏమని?
అప్పారావు : రీచార్జ్ చేసుకోకపోతే కనెక్షన్ కట్ చేస్తామని.
తప్పిపోయింది
అప్పారావు : నేను చికాగో నుంచి తెచ్చిన కుక్కపిల్ల తప్పిపోయింది, పేపర్ లో ప్రకటన ఇవ్వాలనుకుంటున్నా!
సుబ్బారావు : మీ కుక్కకి పేపర్ చదవటం కూడా వచ్చా!
డ్రైవర్
అప్పారావు: నిదానంగా నడిపే డ్రైవర్ కావాలన్నావుగా? ఇదిగో ఇతడే.
సుబ్బారావు: అంత క్రితం ఏ బండి నడిపేవాడు?
అప్పారావు: రోడ్ రోలర్!
కంగ్రాట్స్ అండి!
టీచర్: (బంటి నాన్నాతో ) కంగ్రాట్సండీ! మీకు కొడుకు పుట్టాడటగా?
బంటి:నాన్నా: లేదే …..ఎవరు చెప్పారు?
టీచర్: మీ అబ్బాయే. తమ్ముడు పుట్టాడని నిన్న సెలవు తీసుకున్నాడుగా? !
T తరువాత?
టీచర్: ఒరేయ్ చంటి, T తరువాత ఏమొస్తుందిరా?
చంటి: బిస్కట్లు టీచర్.
ఎలా చెప్పగలవు!
అప్పారావు: మా వాడికి లెక్కలొచ్చు కానీ, జి.కె. లో మాత్రం పూర్.
సుబ్బారావు: ఎలా చెప్పగలవు?
అప్పారావు: 152/2, కాకినాడ అని అడ్రస్ రాయమంటే, 76 కాకినాడ అని రాసిచ్చాడు!
అయితే!
డ్రైవర్: సార్ కారులో పెట్రోలు అయిపోయింది సార్. అంగుళం కూడా ముందుకు పోదు.
అప్పారావు: అయితే వెనక్కి పోనీ.
పొగ
టీచర్: ఎప్పుడూ సిగరెట్లు కాలుస్తుంటే ఏమొస్తుందిరా?
నాని: పొగ వస్తుంది టీచర్.
ఎందుకు?
టీచర్: శిశుపాలుని తప్పులను వంద వరకే శ్రీ కృష్ణుడు ఎందుకు క్షమించాడ్రా?
చంటి: శ్రీ కృష్ణుడికి వంద వరకే అంకె లొచ్చు టీచర్.
ఆ రెండు!
నాన్నా: ఏరా లెక్కల్లో మార్కులు వందకు ఫైనే వచ్చాయన్నావు? మరి రెండు మార్కులు వచ్చాయి ఏంటిరా?
చింటు : అవును నాన్నా! ఆ రెండు ఎక్కడ వేశారో చూడు. వందకు ఫైనే కదా!
అసాధ్యం
చంటి: ‘అసాధ్యం’ అనే పదం అసలు నా డిక్షనరీ లోనే లేదు.
బంటి: ఇప్పుడు చెబితే ఏం లాభం. డిక్షనరీ కొనేప్పుడే చూసుకొని ఉండాల్సింది….!
అవుతావనే!
కొడుకు: నాన్నా! నాకు నూటికి నూరు మార్కులొస్తే ఏం చేస్తావు?
నాన్నా: అబ్బో! మూర్చపోతా.
కొడుకు: అలా అవుతావనే ముప్పై తెచ్చుకున్నా నాన్నా!
చెప్పానా!
అమ్మ: ఏరా! అన్నదమ్ములు ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పానా? కొట్టుకుంటారేం?
పెద్దకొడుకు: మేమూ ఇచ్చిపుచ్చుకుంటున్నాం. నేనొక దెబ్బ ఇస్తే , వాడు ఒకటిచ్చాడు!
నా అంత అయ్యాక!
టీచర్: నా అంత అయ్యాక ఏం చేస్తావు రాధ?
రాధ: సన్నబడడానికి ప్రయత్నిస్తాను మేడం!
అందుకే!
డాడి: ఎందుకు ఏడుస్తున్నావ్?
చంటి: మమ్మీ! అరటి పండు మీద కాలేసి జారింది.
డాడి: మమ్మీ పడితే నువ్వెందుకు ఏడవడం?
చంటి: పడినప్పుడు చూసి నవ్వానని అమ్మ కొట్టింది. అందుకే!
English: twinkle twinlke little star
how i wonder what u are
Telangana Telugu: merishe merishe shinna sukka
pareshan ayiti ne ninnu sushi
English: Johnny Johnny Yes papa
Eating Sugar No papa
Telling lies no papa
Open your mouth ha ha ha
Telangana Telugu: Johnny ga oh.. Johnny ga..
Endhi naina Shekkar Bukkinava ra.. ledhu naina
abaddalu adutunnava ra munda koduka
noru teruvara lambidi koduka
English: Jack and Jill went up the hill
To fetch a pail of water
jack fell down and broke
his crown jill came tumbling down.
Telangana Telugu: jack gaadu jill gaadu konda ku poyinru
gaadi ki poyi neellu testunte jack
gaadu kinda padi
moothi bokkal saap chesu kundu
jill gaadu dil khush toni panduga cheskunnadu
వీడి ఛానెల్ లొ న్యూస్ కి చిన్న ఉదాహరణ (Fiction)
మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల కాలు విరిగి కుంటుంతుంటుంది. మనకి టైం ఉంటె ఆగి దానికి ఏమి కావాలొ చూస్తాం, లేదు అంటె అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతాం.
tv-7 రిపోర్టర్ వెళ్తున్నాడు, వెంటనె tV-7 ఆఫిస్ కి ఒక ఫొన్ వెల్తుంది, వాడు కెమెరామెన్ ని పంపుతాడు.
ఇక మొదలు……..
క్రిష్ణ ఆ కుక్క పరిస్తితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?
ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుంతుంది……స్వప్న
ఆక్కడి వాళ్ళు ఏమన్న చెబుతున్నార?…క్రిష్ణ
స్వప్న…ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విదం గ గతం లొ ఆ కుక్క ఈ area లొ ఇలా కుంటలేదని, ఇదె తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు
కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? …..క్రిష్ణ
కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న. ఈ విదం గ కాలు కు దెబ్బ తగలటం కొత్త అనుకుంట, అందుకె కుంటటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటనికి ప్రయత్నించిన అది సమాధానం చెప్పకుండ, మూలుగుతుంది…..స్వప్న
థాంక్ యు క్రిష్ణ, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తు ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.
ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైం ప్రతినిధి క్రిష్ణ అందించిన వివరాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..
బ్రేక్ తర్వాత కుక్కలు-కుంటుడు అంశం పై చర్చింటానికి ప్రముఖ Doctor కుక్కుటేశ్వర రావ్ గారు మన Studio కి వస్తున్నారు..
బ్రేక్ తర్వాత……….
సుధాకర్ : చెప్పండి కుక్కుటేశ్వర్ రావ్ గారు గతం లొ మీరు ఎప్పుడైన ఇలా కుక్కలు కుంటటము చూసార? ఒక వేళ చూస్తె ఏ జాతి కుక్కలు కుంటటము చుసి ఉంటారు.
కుక్కుటేశ్వర్ : ఈ విదం గ కుక్కలు కుంటటం ఇది మొదటి సారి కాదు. ఫ్రపంచవ్యాప్తం గ ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లొ ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటటానికి జాతి తో సంబందం లెదు.
సుధాకర్: అంటె కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమన్న బాధ ఉంటుందా? ఉంటె ఎటువంటి బాధ?
కుక్కుటెశ్వర్ : బాధ లొ రకాలు ఉండవండి. కుంటెటప్పుడు general గ దెబ్బ తలిగిన కాలు కి నొప్పి ఉంటుంది అని Dog’s Medical Science లొ గట్టి ఆధారాలు ఉన్నాయి.
సుధాకర్ : తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైం ప్రతినిధి క్రిష్ణ టెలి ఫొన్ లొ సిద్దం గ ఉన్నారు…క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.
క్రిష్ణ : (చెవిలొ ear piece పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు..)
క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క ఫరిస్థితి ఎలా ఉంది?
సుధాకర్ … కుక్క మూలుగుతుంది, ఇప్పుడె blue cross వాళ్ళు దానిని తీసుకువెళ్ళారు.
కుక్క కాలు కి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నయి?…క్రిష్ణ
సుధాకర్, కుక్క కాలు కి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకర గా ఉంది.
వంకర అంటె ఎలా ఉంది…క్రిష్ణ (ఇప్పుడు సుధాకర్ మొహం లొ expressions ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ ని ద్వంసం చెయ్యటానికి wait చెస్తున్న soldier face లొ తప్ప)
సుధాకర్ వంకర గ అంటిచుకుని ఉంది, నేను ఇప్పటికి దానిని straight చెయ్యటనికి try చెతున్నాను కాని అది చుట్టుకుపొతుంది. బహుశ కాలు కి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దెశం.
థాంక్ యు క్రిష్ణ….కుక్కుటెశ్వర్ గారు, కాలు కి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి క్రిష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?
స్పందన అంటె ఏమి ఉంటుంది రా పుండకార్ వెధవ…కుక్క తోక కాలు కి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంటి ర ధేడ్ దిమాగ్ గ. ఏమి మనిషివి ర నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచిన answers చదివాను, ఇంక నా వల్ల కాదు, నా టి మరిగిపొతూ ఉంటుంది. బంగారం లాంటి మల్లయ్య అనే పేరు మార్చి కుక్కుటెశ్వర్ రావ్ అని మార్చి, షర్ట్, పాంట్ రెంట్ కి తెచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ act చెయ్యలా? ఇల act చేస్తె నా tea కొట్టు నుంచి ఎదురు గ ఉన్న మీ tV-7 office కి రొజు 100 tea లు ఆర్డెర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందంట్ర వెధవ *్*్*్*.దొంగ నా &%%్**( గాలి న &$%్**.. మీ బతుకులు చెడ….)
(ఇలా తిడుతు ఉండగానె, tV-7 లోగొ వచ్చి, మెరుగైన సమాజం కొసం చుస్తూనే ఉండండి tV-7 అని voice వినిపించి ads రావటం మొదలవుతాయి..)
. “ఒరేయ్ రామూ, నేను మీ నాన్నగారికి రెండు వేల రూపాయలు అప్పు ఇచ్చి నెలకు రెండు వందలు చొప్పున తీర్చమన్నాననుకో అప్పుడు ఎన్ని నెలలలో నేను ఇచ్చిన అప్పు తీరుతుంది ?” అడిగింది లెక్కల టీచర్.
“అసలు తీరదు మేడం” అన్నాడు రాము.
” ఇంత చెప్పీనా నీ బుర్రకు ఏమీ ఎక్కడం లేదు.నీకు లెక్క అసలు అర్ధమవుతున్నాయా లేవా ? కోపంగా అడిగింది టీచర్.
” మీకే మా నాన్న తత్వం అర్ధం కాదు మేడం. అప్పు చేయడమే గాని తీర్చే బుద్ధి మా నాన్నగారికి అసలు లేదు” అసలు సంగతి చల్లగా చెప్పాడు రాము.
2. ” నిన్ను ఇంతకాలం వెంట పడి ప్రేమా దోమా అంటూ వేధించిన ఆ రమేష్ నే పెళ్ళి చేసుకుందామని ఎందుకు నిర్ణయించుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావదం లేదు ” అడిగింది రోజా.
” ఇంత కాలం నా వెంటపడి నన్ను వేధించిన ఆ వెధవను పెళ్ళి చేసుకొని ప్రతీకారం తీర్చుకుంటాను. ఇక బ్రతికినంతకాలం వాడి బ్రతుకు కుడితిలో పడిన ఎలకే !క్షణం క్షణం కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతూ చస్తాడు దొంగ వెధవ ” అసలు సంగతి చెప్పింది అయేషా.
.“ఏయ్ ! హేండ్సప్ ! చేతులు పైకెత్తి స్ట్రైట్ గా నిలబడు, అసలు కదలొద్దు. లేకపొతే షూట్ చేసెస్తాను” రివాల్వర్ చూపిస్తూ అరిచాడు బందిపోటు దొంగ భీమారావు.
“ చేతులు నొప్పిగా వున్నాయి ,అస్సలు పైకెత్తలేను, ఏం చేస్తావో చేసుకో? “ ఆసక్తిగా అన్నాడు రాజారావు
“ చెప్పిన విధం గా చెసి నన్ను కన్ ఫ్యూజ్ చెయ్యకుండా కాస్త కోపరేట్ చెయ్యవయ్యా బాబూ ! నాకసలే ఈ వృత్తి కొత్త. నీలాంటి పెద్ద మనుష్యులు కాస్త సహాయం చెసి నాకు కాంఫిడెన్స్ ఇవ్వాలి లేకపోతే ఈ వృత్తిలో రాణించలేను” అసలు సంగతి చెప్పాడు భీమారావు.
2.“ ఆ దొంగ బస్సులో అంత రష్ లో నీ జాకెట్లో చెయ్యి పెట్టి పర్సు కొట్టెస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావే ? గట్టిగా కేకలు పెట్టి వాడిని పట్టించక పొయ్యావా ?” ఆశ్చర్యం గా అడిగింది రేఖ
“ ఆ దొంగ వెధవ జాకెట్లో చెయ్యి పెట్టింది పర్సు కోసమని నేను అనుకోలేదు, అందులే అరవలేదు” అసలు సంగతి ఐస్ క్రీం తింటూ తాపీగా చెప్పింది సృజన.
Your vote:
నేను రోజుకు ఆరేడు కవితలు రాసి పారేస్తుంటాను తెలుసా !” గర్వం గా చెప్పాడు అభ్యుదయ కవినని చెప్పుకొనే కామేశ్వరరావు.
” రాసి అవతల పారేస్తేనే మంచిది. వాటిని పత్రికలకు పంపించడం, రేడియోలలో , కవితా గోష్టులలో చదవడం చేస్తే మెదడు వాపు వ్యాధులు గట్రా వచ్చే ప్రమాదముంది.” అసలు సంగతి చెప్పాడు రవీంద్ర.
2.”నాకూ మా ఆవిడకు గొడవ వస్తే కొద్ది నిమిషాలలోనే సమసిపోతుంది తెలుసా !” కాలర్ ఎత్తుకొని గర్వంగా అన్నడు వాలేశ్వరరావు.
” అరే మీరెంతో గ్రేట్ రా! ఆ కిటుకేదో నాక్కూడా చెప్పకుడదా. మా ఇద్దరి మధ్య గొడవ గనుక లేస్తే గంటలకు గంటలు నడుస్తుంది” దీనంగా అడిగాడు పిచ్చేశ్వరరావు.
“ఏముంది, వెరీ సింపుల్. గోడవ మొదలైన వెంటనే మా ఆవిడకు దొరకకుండా నేను మంచం కిందకు దూరిపోతాను. నన్ను పట్టుకోలేక ఆ అప్పడాల కర్రను అవతల పారేసి మా ఆవిడ వెళిపోతుంది. ఆ తర్వాత నేను తాపీగా బయటకు వచ్చి ఆవిడ కోపం తగ్గేవరకు కాళ్ళు పట్టుకునే వుంటాను.అంతే ! ఆవిడ ఐసైపోయి నన్ను క్షమించేస్తుంది.” అసలు సంగతి చెప్పాడు వాలేశ్వరరావు.
* Jokes
1.”ఇదివరకు వస పిట్టలా గడ గడ వాగుతుందే వాడివి. ఇప్పుడేమిటి సైలెంట్ గా వుంటున్నావు ?” ఆశ్చర్యంగా అడిగాడు వెంగళ్రావు.
” ఈ మధ్యనే బొలెడు కట్నం తీసుకొని పెళ్ళి చేసుకున్నాను. ఇంక పెళ్ళాం ముందు నోరు విప్పడం కూడానా నా బ్రతుకుకి ? అసలు సంగతి విచారం గా చెప్పాడు తాతారావు.
2.”ఈ మధ్య మన చంటాడికి అన్ని మీ బుద్ధులే వస్తున్నాయండీ ” అంది మంగ
“ఏం చేస్తున్నాడు ?” ఆశ్చర్యంగా అడిగాడు గవర్నమెంట్ ఉద్యోగి అయిన అప్పారావు.
” లంచం ఇవ్వందే ఏ పని ఆఖరుకి భోజనం కూడా ఫ్రీ గా చెయ్యడం లేదు.పగటి పుట స్కూలులో బెంచీ ముందు కూర్చోని హాయిగా పడుకుంటునాడట. మాస్టారు ఏం అడిగినా తెలీదు తెలీదు అని విసుక్కుంటున్నాడట.ప్రోగ్రెస్ రిపోర్ట్ పై దొంగ సంతకాలు కూడా పెడుతున్నాదట ” అసలు సంగతి చెప్పింది మంగ
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
Submitted by cpratap on Tue, 06/16/2009 – 07:35.
* Jokes
(1)ఎందుకే ఈ పచ్చడి బండను షో కేసులో పెట్టావు ? ఏమిటి దాని ప్రత్యేకత ? ” అడిగింది రాజి.
” నేను కాపురానికి వచ్చిన వారం రోజుల లోనే ఈ పచ్చడి బండకు గుద్దుకొని పడిపోయే మా అత్తగారు టపా కట్టేసింది.నాకు అత్త పోరు లేకుండా చేసింది. అందుకే ఈ పచ్చడి బండ అంటే నాకెంతో ఇష్టం. దానిని అపురూపం గా దాచుకున్నాను.” గర్వం గా చెప్పింది రేఖ.
(2)” ఈ ఆపరేషన్ థియేటర్లో పూల దండ ఎందుకు పెట్టారు సార్ ?” ఆదుర్దాగా అడిగాడు చిన్నారావు.
” ప్రాక్టీస్ మొదలెట్టిన దగర్నుంచీ నేను చేస్తున్న మొదటి ఆపరేషను ఇది.సక్సెస్ అయితే దేవుడికి వేస్తాం. ఫెయిలయితే నీకు వేస్తాం” తాపీగా కళ్ళజోడు సవరించుకుంటూ అన్నాడు డాక్టర్ దైవాధీనం
1. “మా ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా సరే రెండు రోజులకు మించి వుండరు తెలుసా ?” గర్వంగా భుజాలెగరేసుకొని అన్నాడు పాపారావు
“అరే. అలా ఎలా మానేజ్ చేయగలుగుతున్నావురా ? నాకు కూడా కొంచెం చెప్పు. చుట్టాల తాకిడితో చచ్చిపోతున్నాం “ అడిగాడు అప్పుల అప్పారావు.
“ చుట్టాలొచ్చిన దగ్గర నుండీ కాఫీ, టిఫిన్ల తొ పాటు వంట కూడా మా ఆవిడ చేత వండిస్తాను. అంతే ఆమె చేతి వంటకు తట్టుకోలేక రెండు రోజులకే అందరూ పరార్ !” అసలు సంగతి చెప్పాడు పాపారావు.
2. “ఇప్పటికే మీ చూపు చాలా మందగించింది. వెంటనే గుట్కా తినడం మానక పోతే చూపు వెంటనే పోయే ప్రమాదం వుంది. జాగ్రత్త “ కోపంగా అన్నాడు డాక్టర్ దైవాధీనం
“డాక్టర్ గారు. నేను వయసు మళ్ళిన వాడిని. చూడవల్సిన విషయాలన్నింటినీ ఇప్పటికే చేసేసాను. ఇప్పుడు కొత్తగా చూపు పోతే మాత్రం వచ్చే నష్టం ఏముంది గనుక “ నిట్టూరుస్తూ జేబు లో నుండి గుట్కా పాకెట్టు తీసి నొట్లో వేసుకున్నాడు వెంకటాచలం.
“బగ్గు”వద్గీత – బగ్గులు ఎందుకు వస్తాయంటే?
కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు.
బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.
బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు.
లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న “C” లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం “C++” లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి “java” లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.
ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ “OK” చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు.
ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు.
ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు.
అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి
“అర్జునా !
బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!
బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!
మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.
నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?”
అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు.
అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు.
గమనిక : ఈ కథ పది సార్లు పారాయణ చేసిన వారికి పది బగ్గులు తక్కువ వస్తాయి !!!
Your vote:
. ” నేనంటే నా భార్యకు ఈ మధ్య ఎంతో ఇష్టం పెరిగింది.” గర్వంగా అన్నాడు రాజు
“ఎలా చెప్పగలవు ?” అడిగాడు గోపి.
“అర్ధ రాత్రి ఒంటి గంటకు ఇంటికి వస్తున్నా అంట్లు తోమేందుకు వేడి నీళ్ళు పెట్టి ఇస్తుంది.బొగ్గుపొడికి బదులు నిర్మా ఇవ్వడం మొదలు పెట్టింది.బట్టలు ఉతికెందుకు సబ్బులో నానేసి రెడిగా వుంచుతుంది. అన్నం తినదానికి నేనెంత కష్టపడతానో అని ఏమీ మిగల్చకుండా అని మొత్తం తినేసి గిన్నెలు ఖాళీ చెసేస్తుంది” అసలు సంగతి చెప్పాడు రాజు.
2. “బ్యాంకు వాడి కూతురిని పెళ్ళి చేసుకోవడం చాలా తప్పయిందిరా !” విచారం గా అన్నాడు సూరి.
“ఏమయ్యింది ? మంచి కుటుంబం , బ్యాంకు సంబంధం , ఇక కట్న కానుకలకు లోటు వుండదని అంటూ ఎగిరి గంతేసి చేసుకున్నావుగా పెళ్ళి ?” అడిగాడు రాము.
” అంతా నా ఖర్మకు వచ్చింది.కట్నం గా ఇచ్చిన ప్రతీ వస్తువుపై గోపాలం గారి ఆర్ధిక సహా
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
Q: "Have you ever read Shakespeare?"
Sardar: "No, who wrote it?"
Sardar ordered a pizza and the clerk asked if he should cut it in six or twelve pieces.
"Six, please. I could never eat twelve pieces."
Why did 18 sardarjis go to a movie?
Because below 18 was not allowed.
How do you measure a Sardar's intelligence?
Stick a tire pressure gauge in his ear
What do you do when a Sardar throws a pin at you?
Run like Hell....he's got a hand grenade in his mouth.
How do you make a Sardar laugh on Saturday?
Tell him a joke on Wednesday.
What is the Sardar doing when he holds his hands tightly over his ears?
Trying to hold on to a thought.
Why do Sardars work seven days a week?
So you don't have to re-train them on Monday.
Why can't Sardars make ice cubes?
They always forget the recipe.
How did the Sardar try to kill the bird?
He threw it off a cliff.
What do you call 10 Sardars standing ear to ear?
A wind tunnel.
What do you see when you look into a Sardar's eyes?
The back of his head.
What do you do when a Sardar throws a hand grenade at you?
Pull the pin and throw it back.
What do you call a sardar who drinks only beer?
Just-beer Singh ('T' silent!).
What do you call a sardar who has only one drink?
Just-one Singh.
Why does Sardar always smile during lightning storms?
They think their picture is being taken.
Why does Sardar have "TGIF" written on their shoes?
Toes Go In First.
How can you tell when Sardar sends you a fax?
It has a stamp on it.
Why can't Sardar dial 911?
They can not find the eleven on the phone
How do you get Sardar on the roof?
Tell him the drinks are on the house.
"Oh, look at the dead bird."
Sardar looked skyward and said "Where, Where?
What do smart Sardar and UFOs have in common?
You always hear about them but you never see them.
Why does it take longer to build a Sardar snowman as opposed to a regular one?
You have to hollow out the head.
TO LOOSE WEIGHT...
The doctor told Sardarji that if he ran eight kilometers a day for 300 days, he would
loose 34 kilos. At the end of 300 days, Sardarji called the doctor to report he had
lost the weight, but he had a problem. "What's the problem?" asked the doctor. "I'm
2400 kms from home."
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *